Tirupati (Telugu) (2014)
తిరుపతి దేవుడి తత్వాన్ని పరిశీలించి మన దైనందిన జీవితాలలోని పరీక్షలకు, విషాదాలకు సంబంధం కలిపే మొట్టమొదటి ప్రయత్నమే “తిరుపతి: జీవితానికి ఒక మార్గదర్శి”.
విషాదం, నిర్లక్ష్యం, నయవంచనలపై కథలతో బాటు, ఐశ్వర్యం, విజయం, విశ్వాసం కనుగొనే మార్గాల ద్వారా పాపం, ధర్మం చర్చించి ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితంలో అమలు పరిచే విధానం తర్కించి తరాల నడుమ అంతరాలకు వారధి కట్టే ప్రయత్నం చేస్తుంది ఈ పుస్తకం.
వేంకటాచల ఆలయం దైవిక, చారిత్రక పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దివ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయ అంతర్భాగం ఈషద్దర్శనం కలిగిస్తుంది. ఇందులో :
తిరుపతిలో ఉత్సవాల జాబితా
ఉత్సవాలలో స్వామి వాహనాలు
స్వామి సుప్రభాతం
ఆలయంలో చేయదగినవని, కూడనివి పొందుపరిచి ఉన్నవి.
భక్త వాత్సల్యంతో వారి కోరికలు తీర్చి ముక్తి ప్రసాదించే వెంకటేశ్వర స్వామి కథకు ఆలయ ప్రధాన అర్చకులు తొలిపలుకు వ్రాశారు. విధి వ్రాత మార్చవచ్చు అని నమ్మి అది ఎలాగో తెలిసికొన గోరేవారికి తిరుపతి: జీవితానికి ఒక మార్గదర్శి.
Paperback (2014)
Tirupati : A Guide to Life (Telugu)
Manjul Publishing House